ట్రోజెనా 2029 ఆసియా వింటర్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న సౌదీ

- October 04, 2022 , by Maagulf
ట్రోజెనా 2029 ఆసియా వింటర్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న సౌదీ

జెడ్డా: ట్రోజెనా 2029 ఆసియా వింటర్ గేమ్స్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనున్నది. 10వ ఆసియా వింటర్ గేమ్స్ (AWG) హోస్ట్ చేయడానికి బిడ్‌ను సౌదీ గెలుచుకుంది. కంబోడియాలో మంగళవారం జరిగిన ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) జనరల్ అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటించారు. సౌదీ ప్రతిపాదనను జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. GCC ప్రాంతంలో మొదటి అవుట్‌డోర్ స్కీయింగ్‌తో సహా ట్రోజెనా ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అభిమానులకు అందించనుంది. ఈ సందర్భంగా సౌదీ ఒలింపిక్ అండ్ పారాలింపిక్ కమిటీ (SOPC) అధ్యక్షుడు ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ టర్కీ అల్-ఫైసల్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఆసియా వింటర్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న మొదటి దేశంగా సౌదీ అరేబియా నిలిచిందన్నారు. ఆసియా వింటర్ గేమ్స్ అనేది ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా సభ్య దేశాల కోసం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే అంతర్జాతీయ బహుళ-క్రీడా ఈవెంట్. ఇందులో ప్రత్యేకంగా శీతాకాలపు ఈవెంట్‌లను నిర్వహిస్తారు. 8వ AWG జపాన్‌లోని సపోరోలో 2017లో నిర్వహించగా.. 9వ ఎడిషన్ 2025లో దక్షిణ కొరియాలోని గ్యాంగ్‌వాన్‌లో జరగాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com