దుబాయ్‌లో హిందూ దేవాలయం ప్రారంభం
- October 06, 2022
దుబాయ్: దుబాయ్‌లో నూతనంగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని బుధవారం భక్తులకోసం అధికారికంగా తెరిచారు. ఈ ఆలయం బెబెలీ అలీ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయాన్ని మినిస్టర్ ఆఫ్ టాలరెన్స్ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ముఖ్యఅతిథిగా, యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ గౌరవ అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సామాజిక నియంత్రణ, లైసెన్సింగ్ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CDA) ఒమర్ అల్-ముత్తన్న, హిందూ దేవాలయం దుబాయ్ ధర్మకర్త రాజు ష్రాఫ్ పాల్గొన్నారు. 200 మంది ప్రముఖులు, రాయబారులు, స్థానిక సంఘం నాయకులు ఈ ప్రారంభ వేడుకలకు హాజరయ్యారు. ఈ నూతన ఆలయం దీపావళి ఉత్సవాల తరువాత అందరికీ అందుబాటులో ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దుబాయ్‌లోని జెబెల్ అలీలోని వర్షిప్ విలేజ్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం కోసం యూఏఈ ప్రభుత్వం 2019లో భూమిని కేటాయించింది. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా ఆలయ నిర్మాణానికి మూడేళ్లు పట్టింది. గురు గ్రంథ్ సాహిబ్‌తో పాటు , వెంకటేశ్వర స్వామి,శివుడు, కృష్ణుడు, గణేష్, షిరిడీ సాయి, బాబా,మహాలక్ష్మి తో సహా 16 మంది దేవత,దేవతామూర్తి లను ఈ ఆలయంలో ఉంచారు.ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునేవారు ఆలయ వెబ్సైట్ ద్వారా ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. సందర్శకులు, భక్తులు వారి పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, సందర్శకుల సంఖ్యను అందించిన తర్వాత క్యూఆర్ టెక్నాలజీతో అరగంటలో స్లాట్లను బుక్ చేసుకోవచ్చని ఆలయ వర్గాలు వెల్లడించాయి.





తాజా వార్తలు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!







