దేశ భవిష్యత్తు, అభివృద్ధికి పునాది విద్య: యూఏఈ ప్రెసిడెంట్

- October 06, 2022 , by Maagulf
దేశ భవిష్యత్తు, అభివృద్ధికి పునాది విద్య: యూఏఈ ప్రెసిడెంట్

యూఏఈ: నాణ్యమైన విద్య, అంకితభావంతో కూడిన ఉపాధ్యాయులు యూఏఈ భవిష్యత్తు పురోగతిలో కీలక పాత్రను పోషిస్తున్నాయని ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అన్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యారంగ నిపుణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు తమ ఆలోచనలను అభివృద్ధి చేసుకునేందుకు సరైన మార్గంలో మార్గనిర్దేశం చేయడంలో ఉపాధ్యాయుల ప్రభావం, ప్రాముఖ్యతను షేక్ మొహమ్మద్ వివరించారు. పిల్లల భవిష్యత్తుకు.. సమాజానికి హానీ కలిగించే ప్రభావాల నుండి రక్షించడంలో ఉపాధ్యాయుల గొప్ప పాత్ర పోషించాలని షేక్ మొహమ్మద్ సూచించారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ తన సైనిక శిక్షణ సమయంలో పొందిన అనుభవాన్ని పంచుకున్నారు. అలాగే ఆధునిక సింగపూర్ వ్యవస్థాపకుడు లీ కువాన్ యూతో తాను జరిపిన సమావేశాన్ని కూడా షేక్ మొహమ్మద్ గుర్తు చేసుకున్నారు. అతని పంచవర్ష ప్రణాళికల గురించి అడిగినప్పుడు.. 25 సంవత్సరాలలో బలమైన విద్యా వ్యవస్థను నిర్మించడంపై తాము దృష్టి సారించామని లీ కువాన్ చెప్పారని యూఏఈ ప్రెసిడెంట్ గుర్తు చేసుకున్నారు. దేశ భవిష్యత్తు ప్రగతికి, అభివృద్ధికి పునాదిగా విద్య ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. రాబోయే 20 ఏళ్లలో దేశాలు తమ అభివృద్ధి, నాగరికతలో ఏ మేరకు పురోగమిస్తాయో విద్య నిర్ణయిస్తుందని షేక్ మహమ్మద్ అన్నారు. పిల్లల చదువుకు పరిమితులు లేవని, వారిని అభివృద్ధి చేసి సరైన దిశలో నడిపించడం ముఖ్యమని ఆయన పిలుపునిచ్చారు. కసర్ అల్ బహర్ మజ్లిస్‌లో షేక్‌లు, అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com