మహిళపై 50,000 దిర్హామ్‌ల దావా.. వ్యక్తి పిటిషన్ కొట్టేసిన కోర్టు
- October 06, 2022
యూఏఈ: చేతబడి చేస్తున్నాడని ఆరోపించి.. తన ప్రతిష్టను దెబ్బతీసిన మహిళపై వ్యక్తి వేసిన 50,000 దిర్హామ్‌ల దావాను కోర్టు కొట్టేసింది. సదరు వ్యక్తి ప్రతిష్టను మహిళ దెబ్బతీసిందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నష్టపరిహార వ్యాజ్యాన్ని అబుదాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు తిరస్కరించింది. అతను చేతబడి చేస్తున్నాడని అనుమానంతో ఫిర్యాదు చేసినప్పుడు, మహిళ తనకున్న న్యాయపరమైన మార్గాలను ఉపయోగించిందని కోర్టు అభిప్రాయపడ్డది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తాను చేతబడి చేశానని మహిళ తనపై క్రిమినల్ ఫిర్యాదు చేసిందని, అయితే సాక్ష్యాధారాలు లేకపోవడంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసును కోర్టుకు తరలించకముందే తిరస్కరించిందని సదరు వ్యక్తి తెలిపాడు. ఈ ఆరోపణలు తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, పని చేసే ప్రాంతంలో తన ప్రతిష్టను దెబ్బతీసిందని ఆ వ్యక్తి తన వ్యాజ్యంలో పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







