థాయిలాండ్‌లో భయానక ఘటన.. కాల్పుల్లో 34 మంది మృతి
- October 06, 2022
థాయిలాండ్: థాయిలాండ్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇవాళ విచక్షణారహితంగా కాల్పులు జరిపి 34 మంది ప్రాణాలు తీశాడు. వారిలో 22 మంది చిన్నారులు ఉన్నారు.థాయిలాండ్‌లోని నోంగ్ బువా లమ్ ఫూ ప్రావిన్స్ లోని ప్రీ స్కూల్ చైల్డ్ డే కేర్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మాజీ పోలీసు అధికారే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. అతడిని ఉన్నతాధికారులు కొన్ని రోజుల క్రితమే విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని వివరించారు. కాల్పులతో పాటు కొందరిని నిందితుడు కత్తితో పొడిచి చంపినట్లు చెప్పారు. అతడు ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై స్పష్టత లేదని తెలిపారు. ఓ ట్రక్కులో నిందితుడు తిరుగుతూ కనపడ్డాడని అన్నారు. పలు ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించామని చెప్పారు. కాగా, థాయిలాండ్ లో ఇటువంటి కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. నఖోన్ రాట్చసిమాలో 2020లో ఓ ఆర్మీ అధికారి కాల్పులు జరిపి 21 మందిని చంపాడు. ఆ ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







