‘ఆది పురుష్’పై ట్రోలింగ్స్‌పై దిల్ రాజు కౌంటర్స్.!

- October 07, 2022 , by Maagulf
‘ఆది పురుష్’పై ట్రోలింగ్స్‌పై దిల్ రాజు కౌంటర్స్.!

దసరా కానుకగా రిలీజైన ‘ఆది పురుష్’ టీజర్‌కి సంబంధించి రకరకాల ట్రోలింగ్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రామాయాణం అనే కాన్సెప్ట్ తీసుకుని, మరీ ఇంత చీప్‌గా బిహేవ్ చేస్తారా.? అంటూ సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్స్ చాలానే పోటెత్తుతున్నాయి.
రాముడి పాత్ర మొదలుకొని, హనుమంతుడు, ముఖ్యంగా రావణాసురుడి పాత్రల చిత్రీకరణలపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయ్. రావణాసురుడి పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ పక్షి వాహనంపై పయనిస్తాడా.? అంటూ తాజాగా మరో వివాదం రేగుతోంది.
ఈ వివాదాలన్నింటినీ ఖండిస్తూ దిల్ రాజు తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని నిమిషాల పాటు సాగే టీజర్‌ని చూసి సినిమా మొత్తాన్ని ఎలా తప్పు పడతారు.? ఓం రౌత్ మంచి దర్శకుడు. ఆయన రూపొందించిన సినిమాలో పాత్రల చిత్రీకరణను తప్పుపట్టడం ఎంతవరకూ సబబు.? అని ఆయన ప్రశ్నించారు.
నేటి తరమే కాదు, భవిష్యత్ తరాలకు కూడా అర్ధమయ్యే రీతిలో ఔం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయినా ఈ మధ్య ప్రతీ సినిమాకి ముందే నెగిటివిటీ ప్రచారం చేయడమన్నది ట్రెండింగ్ అయిపోయింది. అలాగే ‘ఆది పురుష్’ సినిమా విషయంలోనూ జరుగుతుంది. అంతేకాదు, ‘బాహుబలి’ అంతటి సినిమా కూడా ఈ నెగిటివ్ ట్రోల్స్ నుంచి తప్పించుకోలేకపోయింది. అయినా, ఆ సినిమా ఏ స్థాయి విజయం అందుకుందో తెలిసిందే కదా. 
‘ఆది పురుష్’ కూడా రిలీజ్ అయ్యేంతవరకూ దాని రేంజ్ తెలీదు. జవవరిలో రిలీజ్ కాబోయే ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల అంచనాల్ని అందుకుంటుందన్న నమ్మకం వ్యక్తం చేశారాయన. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com