బహ్రెయిన్ పార్లమెంట్, పురపాలక ఎన్నికలు.. ఓటేయనున్న 344,713 మంది
- October 07, 2022
బహ్రెయిన్: 2022 నవంబర్ 12వ తేదీన జరగబోయే పార్లమెంటరీ, మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 344,713 మంది పౌరులు ఓటు వేయనున్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన అప్పీళ్లపై కాంపిటెంట్ న్యాయస్థానం తీర్పును వెలువరించడంతో ఎన్నికల ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ ఈ విషయాన్ని వెల్లడించింది. డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పది ఎన్నికల జిల్లాల్లోని క్యాపిటల్ గవర్నరేట్‌లో 665,148 మంది ఓటర్లు ఉన్నారు. ముహరక్‌లోని ఎనిమిది జిల్లాల ఎలక్టోరల్ బ్లాక్‌లో 81,637 మంది ఓటర్లు, 12-జిల్లా ఉత్తరం బ్లాక్ లో 121,581 మంది ఓటర్లు, 10-జిల్లాల దక్షిణం బ్లాక్ లో 75,347 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు తమ పోలింగ్ బూత్ వివరాలను www.vote.bh ద్వారా తెలుసుకోవచ్చని ఎన్నికల ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మొత్తం 265,138 మంది పౌరుల ఓటరు జాబితాలను తనిఖీ చేసినట్టు లెజిస్లేషన్ అండ్ లీగల్ ఒపీనియన్ కమిషన్ ప్రెసిడెంట్, పార్లమెంటరీ- మున్సిపల్ ఎలక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాఫ్ అబ్దుల్లా హమ్జా తెలిపారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







