ప్రవాసుల వీసా మెడికల్ చెకప్ విధానాల్లో సవరణలు చేసిన ఒమన్
- October 08, 2022
మస్కట్: ప్రవాసుల వీసా మెడికల్ చెకప్ విధానాల్లో సవరణలు చేసినట్టు సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ప్రకటించింది. కొత్త లేదా రెసిడెన్సీ వీసా పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసే సమయంలో ప్రైవేట్ ఆరోగ్య సంస్థలలో సంబంధిత రుసుములను రద్దు చేయడంతో పాటుగా వీసా మెడికల్ చెకప్ విధానాలను సవరించాలని ఆరోగ్య మంత్రి డాక్టర్ హిలాల్ అలీ అల్ సబ్తి ఆదేశించారు. కొత్త సవరణల ప్రకారం వీసా మెడికల్ చెక్-అప్ దరఖాస్తు ఫారమ్‌ను సనద్ కార్యాలయాల నుండి RO 30 రుసుముతో అభ్యర్థించాలని నిర్దేశించారు. ఆపై ఎటువంటి ఛార్జీలు లేకుండా ప్రైవేట్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్లలో అవసరమైన వైద్య పరీక్షలను చేయించుకోవచ్చని తెలిపారు. నివాస వీసా మెడికల్ చెకప్ ఫలితాలు అప్లోడ్ చేయబడతాయని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆమోదిస్తుందన్నారు. దరఖాస్తుదారులు 24 గంటల్లోనే నివేదికను పొందవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్‌లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్‌లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కు ట్రంప్ ఆతిథ్యం..!!
- ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!







