స్నాప్‌చాట్ ద్వారా మద్యం విక్రయం.. వ్యక్తి అరెస్ట్

- October 08, 2022 , by Maagulf
స్నాప్‌చాట్ ద్వారా మద్యం విక్రయం.. వ్యక్తి అరెస్ట్

కువైట్: స్నాప్‌చాట్ ద్వారా మద్యం విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తి(30)ని అరెస్ట్ చేసినట్లు జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు. 150 దీనార్లకు దిగుమతి చేసుకున్న రెండు బాటిళ్ల వైన్‌ను అతను విక్రయించడానికి ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. దీంతో దిగుమతి చేసుకున్న మద్యాన్ని అక్రమ రవాణా చేసినందుకు అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సైబర్ నేరగాళ్లపై దృష్టి సారించే క్రమంలో స్నాప్‌చాట్ లో వారాంతాల్లో మద్యపానానికి సంబంధించిన ప్రచారం కనిపించిందని, దాంతో భద్రతా దళాలు డిటెక్టివ్‌ల సాయంతో విక్రేతతో కమ్యూనికేట్ అయ్యారని, రెండు సీసాల మద్యం కావాలని నిందితుడిని ట్రాప్ లో పెట్టినట్లు వివరించారు. సాల్మియా ప్రాంతంలోకి నిందితుడు రాగానే పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమతితో అరెస్టు చేసినట్లు ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు. అనుమానితుడు జాతీయత అనుమానస్పదంగా ఉందని, నిందితుడి ఇంటి నుంచి మరో నాలుగు డబ్బాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com