మంటల్లో చిక్కుకున్న నౌకలోని సిబ్బందిని రక్షించిన సౌదీ బోర్డర్ గార్డ్స్
- October 08, 2022
సౌదీ: ఎర్ర సముద్రంలో జజాన్ పోర్ట్కు వాయువ్యంగా 123 నాటికల్ మైళ్ల దూరంలో మంటల్లో చిక్కుకున్నపనామాకు చెందిన ట్యాంకర్ షిప్ సిబ్బందిని రక్షించినట్లు సౌదీ బోర్డర్ గార్డ్స్ వెల్లడించింది. జెడ్డా సెర్చ్ అండ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (JMRCC)కి మంటలు చెలరేగిన షిప్ నుండి మేడే సిగ్నల్ అందిందని, వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి సహాయక బృందాలు వెళ్లాయని బోర్డర్ గార్డ్స్ అధికారిక ప్రతినిధి కల్నల్ మిస్ఫ్ర్ అల్-ఖరినీ వివరించారు. వివిధ దేశాలకు చెందిన 25 మంది నావికులతో కూడిన సిబ్బందిని రక్షించి జజాన్ నౌకాశ్రయానికి వారిని సురక్షితంగా తరలించినట్లు కల్నల్ అల్-ఖరినీ వెల్లడించారు. ప్రస్తుతం నౌకా సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉన్నారన్నారు.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







