ఒమన్ పర్యాటక రంగం రికవరీ.. త్వరలో కొత్త ప్రాజెక్టులు
- October 09, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో పర్యాటక రంగం క్రమంగా మునుపటి స్థాయికి చేరుకుంటుందని హెరిటేజ్, టూరిజం శాఖ మంత్రి సలేం అల్ మహ్రూఖీ తెలిపారు. పర్యాటక రంగ పునరుద్ధరణకు త్వరలో కొత్తగా అనేక ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పర్యాటకులకు ఈ ప్రాజెక్ట్‌లు వైవిధ్యంతో కూడిన అనుభవాలను అందిస్తాయని వివారించారు. ప్రస్తుతం అమ్రామ్ కంపెనీ మద్దతు, భాగస్వామ్యంతో అనేక గవర్నరేట్లలో పబ్లిక్ యుటిలిటీల ప్రణాళికలు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. విదేశీ పెట్టుబడులతో నాణ్యమైన ప్రాజెక్టులు ఆమోదించబడిన కార్యక్రమాల ప్రకారం కొనసాగుతాయన్నారు. పర్యాటక ఉత్పత్తులను అందించడంతోపాటు ఆతిథ్యం, వినోదం, వినోద సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా అల్ బురైమి తలాలత్ ప్రాజెక్ట్.. 700,000 రియాల్స్ ఖరీదు చేసే అల్ బురైమిలోని అల్-అబైలా పార్క్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్టులపై పని జరుగుతోందని మంత్రి వివరించారు. వీటితో పాటు అల్ దఖిలియా గవర్నరేట్‌లో.. నిజ్వా గేట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లలో సాంస్కృతిక చరిత్రను టూరిస్టులకు పరిచయం చేయడానికి ఇంటరాక్టివ్ ప్లాట్‌ఫారమ్‌లు, డిజిటల్ ప్యానెల్లు ఉంటాయని తెలిపారు. అలాగే అల్ దహిరా గవర్నరేట్‌లో, అటాలా ఇబ్రి ప్రాజెక్ట్, యాన్‌కుల్ రెస్ట్ హౌస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ధాంక్ రెస్ట్ హౌస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనే మూడు ప్రాజెక్ట్‌లలో ప్రస్తుతం పని జరుగుతోందని, మొత్తం 2 మిలియన్లకు పైగా ఖర్చుతో కొత్త ప్రాజెక్టుల పనులు జరుతున్నయని హిస్ ఎక్సలెన్సీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు







