సౌదీలో చట్టాలు ఉల్లంఘించిన 15,894 మంది అరెస్టు

- October 09, 2022 , by Maagulf
సౌదీలో చట్టాలు ఉల్లంఘించిన 15,894 మంది అరెస్టు

రియాద్ : రెసిడెన్సీ, కార్మిక చట్టాలు, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 15,894 మందిని ఒక వారంలో కింగ్‌డమ్‌లోని వివిధ ప్రాంతాలలో అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 5 వరకు వారంలో రాజ్యమంతటా వివిధ భద్రతా దళాలు నిర్వహించిన ఉమ్మడి క్షేత్ర తనిఖీల సందర్భంగా వీరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఇందులో 9,192 మంది రెసిడెన్సీ, 3,968 మంది సరిహద్దు భద్రతా నియమాలు, 2,734 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారు. రాజ్యంలోకి సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మరో 313 మంది అరెస్టయ్యారు. అరెస్టయిన వారిలో 51% మంది యెమెన్‌లు, 37% ఇథియోపియన్లు, 12% ఇతర జాతీయులు ఉండగా.. మరో 42 మంది సౌదీ అరేబియా నుండి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 48,911 మంది సౌదీ చట్టాలను ఉల్లంఘించినవారని, ఇందులో 45,422 మంది పురుషులు, 3,489 మంది మహిళలు ఉన్నారని తెలిపారు.వారిలో 38,790 మంది తమ ప్రయాణ పత్రాలను పొందేందుకు వారి దౌత్య కార్యాలయాలకు, 2,169 మంది వారి ప్రయాణ రిజర్వేషన్‌లను పూర్తి చేయడానికి.. 8,234 మంది ఉల్లంఘించిన వారిని బహిష్కరించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎవరైనా చొరబాటుదారులను రాజ్యంలోకి ప్రవేశించడానికి సహాయం అందించిన వారికి గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, SR1 మిలియన్ వరకు జరిమానా విధించబడుతుందని అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com