HCA అధ్యక్షుడు అజారుద్దీన్‌పై మరో కేసు..

- October 10, 2022 , by Maagulf
HCA అధ్యక్షుడు అజారుద్దీన్‌పై మరో కేసు..

హైదరాబాద్: HCA అధ్యక్షుడు అజారుద్దీన్‌పై మరో కేసు నమోదైంది. ఇటీవల కాలంలో HCA తరుచు వివాదంలో చిక్కుంటున్న సంగతి తెలిసిందే.సెప్టెంబర్ 25న ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియా – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నేపథ్యంలో హెచ్‌సీఏ (HCA) మీద కేసుల మీద కేసులు నమోదయ్యాయి. అజారుద్దీన్‌తో పాటు హెచ్‌సీఏ నిర్వాహకులపై హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పుడు అధ్యక్షుడు అజారుద్దీన్‌పై మరో కేసు నమోదైంది.

హెచ్‌‌సీఏ మాజీ అధ్యక్షుడు జి.వినోద్, సెక్రటరీ శేషు నారాయణ్, హెచ్‌సీఏ మెంబర్ చిట్టి శ్రీధర్ బాబు కలిసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు పిర్యాదు చేశారు. సెప్టెంబర్ 26 తేదీతోనే హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ గడువు ముగిసిందని.. అయినా పదవిలో కొనసాగుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా తప్పుడు డాక్యుమెంట్స్‌ క్రియేట్ చేసి బీసీసీఐతో పాటు ఈసీ కమిటీని తప్పుదోవ పట్టించే విధంగా అజారుద్దీన్ వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పదవి కాలంపై ఎవరిని సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసుకున్నారని కంప్లైంట్‌లో వివరించారు. ఈ నెల 18న బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్‌కు హాజరు అయ్యేందుకు అజారుద్దీన్ తన పదవి సమయాన్ని పొడిగించుకున్నట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకుని.. అజారుద్దీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com