యూఏఈలో పాక్షిక సూర్యగ్రహణం: ఇలా చూడండి

- October 10, 2022 , by Maagulf
యూఏఈలో పాక్షిక సూర్యగ్రహణం: ఇలా చూడండి

యూఏఈ: 2022 సంవత్సరంలో చివరి పాక్షిక సూర్యగ్రహణం అక్టోబర్ 25న యూఏఈలో కనిపిస్తుందని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ (DAG) వెల్లడించింది. పాక్షిక సూర్యగ్రహణం అనేది సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సంభవించే అరుదైన సంఘటన అని డీఏజీ తెలిపింది. అయితే, ఈ సమయంలో సూర్యుడిని నేరుగా చూడవద్దని సూచించింది. కాగా అరుదైన ఖగోళ దృశ్యాలను వీక్షించేటప్పుడు కళ్ళను రక్షించుకోవడానికి అవసరమైన చిట్కాలను నిపుణులు తెలిపారు.
ఎప్పుడంటే..
ఈ అద్భుత ఖగోళ దృశ్యం అక్టోబర్ 25న మధ్యాహ్నం 2.42 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.54 గంటలకు ముగుస్తుంది. గరిష్ఠ గ్రహణం మధ్యాహ్నం 3.52 గంటలకు సంభవిస్తుంది.
ఎలా చూడాలంటే..
సరైన కంటి రక్షణ లేకుండా సూర్యగ్రహణాన్ని చూడవద్దని డీఏజీ హెచ్చరించింది. వీక్షకులు తప్పనిసరిగా ఫిల్టర్ ఉన్న సూర్యగ్రహణం అద్దాలు కొనుగోలు చేయాలని, దీని ద్వారా చూస్తే సూర్యుడు సహజమైన నారింజ రంగులో కనిపిస్తాడని తెలిపింది.
డీఏజీ వర్చువల్ గైడెడ్ టూర్
అక్టోబర్ 25న ముష్రిఫ్ పార్క్‌లోని అల్ తురయా ఖగోళ శాస్త్ర కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో గ్రహణాన్ని వీక్షించడానికి, ప్రత్యేక టెలిస్కోప్‌లు, సూర్యగ్రహణ గ్లాసెస్‌లు అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ ధరలు వ్యక్తికి Dh30 నుండి ప్రారంభమవుతాయని తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com