ముహరక్‌లో తనిఖీ నిర్వహించిన LMRA

- October 10, 2022 , by Maagulf
ముహరక్‌లో తనిఖీ నిర్వహించిన LMRA

బహ్రెయిన్‌: LMRA చట్టం, నివాస చట్టానికి సంబంధించిన ఉల్లంఘనలను గుర్తించడానికి ముహరక్ గవర్నరేట్‌లో బహ్రెయిన్‌ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) సంయుక్త తనిఖీలు నిర్వహించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ముహరక్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాల సహకారంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు అథారిటీ తెలిపింది. ఈ సంధర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయని పేర్కొంది. కార్మిక మార్కెట్ స్థిరత్వం, నియంత్రణను నిర్ధారించడానికి తరచూ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. లేబర్ మార్కెట్‌కు సంబంధించిన ఏవైనా ఉల్లంఘనలను పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో పౌరులు, నివాసితులు సహకరించాలని.. లేబర్ మార్కెట్ ఉల్లంఘనలకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులను 17506055 నంబర్ కు నివేదించాలని ప్రజలకు అథారిటీ పిలుపునిచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com