రష్యా డిమాండ్‌కు వ్యతిరేకంగా భారత్‌ ఓటు

- October 11, 2022 , by Maagulf
రష్యా డిమాండ్‌కు వ్యతిరేకంగా భారత్‌ ఓటు

న్యూఢిల్లీ: ఐరాస సర్వసభ్య సమవేశంలో జరిగిన ఓటింగ్‌లో రష్యా డిమాండ్‌ను తిరస్కరిస్తూ భారత్‌ ఓటు వేసింది. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌, దొనెట్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ అల్బానియా తీర్మానం ప్రతిపాదించింది. దీనిపై రికార్డెడ్‌ ఓటింగ్‌ నిర్వహించాలని కోరింది. రష్యా మాత్రం ఈ తీర్మానంపై రహస్య బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ చేపట్టాలని డిమాండ్‌ చేసింది. మాస్కో డిమాండ్‌పై ఓటింగ్‌ నిర్వహించగా 107 దేశాలు తిరస్కరించాయి. వీటిల్లో భారత్‌ కూడా ఉంది. రికార్డెడ్‌ బ్యాలెట్‌కు అనుకూలంగా న్యూఢిల్లీ ఓటు వేసింది. కేవలం 13 దేశాలు మాత్రమే రష్యాకు అనుకూలంగా మద్దతు తెలుపగా… మరో 39 దేశాలు ఓటింగ్‌కు దూరమయ్యాయి. వీటిల్లో రష్యా, చైనా కూడా ఉన్నాయి.

ఈ ఘటనతో మిత్రదేశంగా ఉన్న రష్యాకు భారత్ షాక్ ఇచ్చినట్టయింది. రష్యా చేసిన డిమాండ్ ను తిరస్కరిస్తూ భారత్ ఓటు వేయడంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని యూఎన్‌జీఏ ప్రకటించింది. మాస్కో చేసిన సవాలుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వంద దేశాలలో భారతదేశం ఒకటి అని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో జరగబోయే ఓటింగ్ కు భారత్, రష్యాకు మళ్లీ షాక్ ఇవ్వనుందా.. లేదంటే తటస్థ వైఖరిని అవలంబించనుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com