ప్రవాసులకు ‘గోల్డెన్ పెన్షన్’ ప్రకటించిన యూఏఈ

- October 11, 2022 , by Maagulf
ప్రవాసులకు ‘గోల్డెన్ పెన్షన్’ ప్రకటించిన యూఏఈ

యూఏఈ: జాతీయులు, నివాసితుల కోసం ఆర్థిక ప్రయోజనాలను పెంచడానికి నేషనల్ బాండ్‌లు యూఏఈలో గోల్డెన్ పెన్షన్ స్కీమ్‌ను ప్రారంభించాయి. యజమానులు, ఉద్యోగుల నుండి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా పెన్షన్ స్కీమ్ ను అభివృద్ధి చేసినట్లు యూఏఈ ప్రముఖ షరియా-కంప్లైంట్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ తెలిపింది. కొత్త ప్రతిపాదన నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు నెలవారీ ప్రాతిపదికన Dh100 ఆదా చేయొచ్చు. దీనిద్వారా అదనపు లాభాన్ని పొందుతారని, ఇది వారి సంస్థ అందించే గ్రాట్యుటీకి అదనంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. నేషనల్ బాండ్స్‌తో రిజిస్టర్ అయిన కార్పొరేట్‌లకు తమ ఉద్యోగుల ఆర్థిక లక్ష్యాలకు తోడ్పాటు అందించడం ఈ విశిష్ట పథకం అందుబాటులో ఉంటుందన్నారు. యూఏఈ జనాభాలో 89 శాతం నిర్వాసితులను లక్ష్యంగా చేసుకున్న ఈ పథకం కింద నేషనల్ బాండ్‌లు అందించే ఆకర్షణీయమైన రిటర్న్స్ ఇస్తుందని దుబాయ్‌కి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ యాజమాన్యంలోని నేషనల్ బాండ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com