శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ తేజ్..
- April 19, 2016
ఆరడుగులకు పైగా ఎత్తు....మ్యాన్లీ లుక్స్, నేచురల్ యాక్టింగ్‌తో వరుణ్‌తేజ్ మూడు సినిమాలతోనే ప్రామిసింగ్ స్టార్ అనిపించుకున్నారు. ఆయన నటించిన 'కంచె' ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సాధించడంతో ఒక్కసారిగా క్రేజ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. దాంతో ఆయన తదుపరి చిత్రంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'మిస్టర్' అనే టైటిల్ ఖరారు చేశారు.లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై 'ఠాగూర్' మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ మే 15 నుంచి స్పెయిన్‌లో జరగనుంది. ఇందులో లావణ్యా త్రిపాఠీ, హెబ్బా పటేల్ కథానాయికలు. నిర్మాతలు 'ఠాగూర్' మధు, నల్ల మలుపు శ్రీనివాస్(బుజ్జి) మాట్లాడుతూ-''ఈ చిత్రానికి స్క్రిప్టు చాలా బాగా వచ్చింది.ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ సిద్ధమవుతోంది. ఊటీలో దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు గోపీమోహన్, శ్రీధర్ సీపానలు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ నెలాఖరున లాంచనంగా పూజాకార్యక్రమాలు నిర్వహిస్తాం'' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: యువరాజ్, సమర్పణ: బేబీ భవ్య.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







