అల్ ఖోర్ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
- October 12, 2022
దోహా: ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (పిహెచ్‌సిసి) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన అల్ ఖోర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌ను ఖతార్ ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి హెచ్ఇ షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్-థానీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి కొత్త ఆరోగ్య కేంద్రంలోని వార్డులను తిరిగి పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు, ఆరోగ్య, ఆరోగ్య సౌకర్యాలను అందించే సరికొత్త వైద్య సాంకేతికతలతో కూడిన ప్రత్యేక క్లినిక్‌లు, విభాగాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నూతన ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న ఆరోగ్య సేవల గురించి కూడా ఆయన ఆరా తీశారు. HE ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రితో పాటు ప్రజారోగ్య మంత్రి HE డాక్టర్ హనన్ మొహమ్మద్ అల్ కువారి, ఆరోగ్య రంగంలోని అనేకమంది సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాన మంత్రి అబ్దుల్ అజీజ్ అల్-థానీ మాట్లాడుతూ.. పౌరులు, నివాసితులకు ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, ప్రాథమిక సంరక్షణ సేవలను అందించే ఆరోగ్య కేంద్రాలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. కొత్త అల్ ఖోర్ ఆరోగ్య కేంద్రం 5,000 మంది రోగులకు సేవలు అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







