సాస్ క్యాన్లలో నిషేధిత పిల్స్.. ఖతార్ కస్టమ్స్ సీజ్
- October 13, 2022
సాస్ క్యాన్లలో నిషేధిత పిల్స్.. ఖతార్ కస్టమ్స్ సీజ్
దోహా: ఎయిర్ కార్గో, ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లోని పోస్టల్ కన్సైన్మెంట్స్ ద్వారా ఖతార్లోకి నిషేధిత పదార్థాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు కస్టమ్స్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఫుడ్ షిప్మెంట్లో సాస్ క్యాన్లలో లభించిన లిరికా మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న నిషేధిత పదార్థానికి సంబంధించిన ఫోటోలను కూడా కస్టమ్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని, వారు అనుసరిస్తున్న అనేక పద్ధతులను తెలుసుకొని స్మగ్లింగ్ ను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు ఈ సందర్భంగా కస్టమ్స్ అధికారులు తెలియజేశారు. స్మగ్లర్ల గురించిన సమాచారం తెలిస్తే తమకు నివేదించాలని పౌరులు, నివాసులను అధికారులు కోరారు.
తాజా వార్తలు
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్
- టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికార నివాసభవనంలో ఘనంగా దీపావళి వేడుకలు
- ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
- వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!