రెండు వారాల్లో 6 కోట్ల దినార్ల డ్రగ్స్, మద్యం సీజ్ చేసిన పోలీసులు

- October 14, 2022 , by Maagulf
రెండు వారాల్లో 6 కోట్ల దినార్ల డ్రగ్స్, మద్యం సీజ్ చేసిన పోలీసులు

కువైట్: డ్రగ్స్, మద్యం అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. షాబు అనే వ్యక్తి 300 కిలోల హషీష్, మెథాంఫేటమిన్ ను స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకొని అరెస్ట్ చేశారు. అటు గత రెండు వారాల్లో దాదాపు 6 కోట్ల దినార్ల విలువైన డ్రగ్స్, మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. అందులో 23,000 మద్యం బాటిళ్లు ఉన్నాయి. గత వారం ఇద్దరు కువైట్ పౌరులు, ఒక యెమెన్ వ్యక్తి అక్రమంగా 40 కిలోల హషీష్ , 150,000 క్యాప్‌గాన్ డ్రగ్ టాబ్లెట్‌లను స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఈ నెల 11న కువైట్ కోస్ట్‌గార్డ్ సుమారు 3 మిలియన్ల దినార్ల వ విలువైన డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. అక్రమంగా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com