హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు మరో అరుదైన ఘనత
- October 15, 2022
హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు మరో అరుదైన ఘనత లభించింది. పచ్చదనం పెంపుపై వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతోపాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్ అవార్డునూ దక్కించుకొన్నది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి వరల్డ్ సిటీ గ్రీన్ అవార్డును ప్రదానం చేశారు. ఆరు కేటగిరీల్లో వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డులను ప్రకటించగా 18 దేశాలకు చెందిన నగరాలు ఫైనల్కు ఎంపికయ్యాయి. ఇందుకు భారత్ నుంచి హైదరాబాద్ ఎంపిక కావడం విశేషం.
ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన పచ్చదనానికి ‘లివింగ్ గ్రీన్’ విభాగంలో అవార్డు లభించింది. ఔటర్ రింగ్ రోడ్డు తెలంగాణ రాష్ట్రానికే గ్రీన్ నెక్లెస్లా ఉందని ఏఐపీహెచ్ అభివర్ణించింది. ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించడంపై మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ అధికారుల కృషిని అభినందించారు. హైదరాబాద్కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు లభించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు ఇతర అధికారులను సీఎం అభినందించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!
- నవంబర్ లో ఫ్లైట్స్ రేట్స్ డ్రాప్..!!
- పాఠశాల క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీపై ఖతార్ వార్నింగ్..!!
- మానవ అక్రమ రవాణాపై కువైట్ ఉక్కుపాదం..!!
- ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- హైల్ మసాజ్ పార్లర్లో అనైతిక చర్యలు..!!
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు