జెడ్డాలో ప్రారంభమైన కూల్చివేతలు
- October 16, 2022
జెడ్డా: ఉమ్ అల్-సలామ్, కీలో -14 ప్రాంతాల్లో ఇండ్ల కూల్చివేతలను ప్రారంభించినట్లు జెడ్డా మురికివాడల కమిటీ వెల్లడించింది. అక్టోబర్ లోనే ఆయా ప్రాంతాల్లోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. ఈ చివరి దఫాలో మొత్తం 32 ఇండ్లను కూల్చివేయనున్నట్లు ప్రకటించింది. జెడ్డాలోని మురికివాడలను అభివృద్ధి చేయడానికి, మెరుగైన జీవిత నాణ్యతను పెంచేందుకు ఈ ప్రాజెక్ట్ ను చేపట్టినట్టు జెడ్డా మురికివాడల కమిటీ స్పష్టం చేసింది. పునరావాస కేంద్రాల్లోని నివాసితులకు తమ సేవలను అందిస్తూనే ఉంటామని కమిటీ తెలిపింది. వారికి అవసరమైన ఫర్నిచర్, ఆహారం, పరిహారం లేదా శాశ్వత గృహాన్ని పొందే వరకు తమ సేవలు కొనసాగుతాయని తెలిపింది. పరిహారం పొందేందుకు దరఖాస్తులను సమర్పించే ప్రక్రియలను పూర్తి చేయాలని నివాసితులను జెడ్డా కమిటీ కోరింది. మురికివాడల తొలగింపునకు సంబంధించిన పరిహారం కోసం జెడ్డా మేయర్‌లటీ డిజిటల్ పోర్టల్ www.jeddah.gov.sa ద్వారా పరిహారం కోసం అభ్యర్థనలను పంపాలని సూచించింది. మరింత సమాచారం కోసం యూనిఫైడ్ కమ్యూనికేషన్ సెంటర్ (920022447) లేదా ఇ-మెయిల్ [email protected] ద్వారా , Twitter ప్లాట్‌ఫారమ్ @spgacareలో సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్‌వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్‌లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు