శిశువుల కోసం వీసాల జారీని ప్రారంభించిన కువైట్
- October 16, 2022
కువైట్: విదేశాల్లో జన్మించిన శిశువులతోపాటు ఇతర ప్రత్యేక అవసరాలు గల వారికి కుటుంబ వీసాల జారీని తిరిగి ప్రారంభించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 'కొన్ని ప్రత్యేక కేటగిరీ' వ్యక్తులతోపాటు శిశువుల కోసం కుటుంబ వీసాలను తిరిగి జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. కువైట్ వెలుపల జన్మించిన శిశువులు ఉన్నవారు తమ పిల్లలను కువైట్ తీసుకురావడానికి అనుమతించనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. వీసా కోసం వచ్చే అభ్యర్థనలను మానవతా కోణంలో పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. అంతకుముందు విదేశాల్లో జన్మించిన శిశువులను కువైట్ తీసుకొచ్చేందుకు అవసరమైన వీసాల జారీని కువైట్ నిలిపివేసింది.
తాజా వార్తలు
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు