BD42,000 ఫోన్ స్కామ్.. ముఠా అరెస్ట్
- October 16, 2022
బహ్రెయిన్: BD42,000 విలువైన ఫోన్ స్కామ్ కు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. ముఠా బ్యాంకు ఖతాలను స్తంభింపచేసి సొమ్ము రికవరీ చేసినట్లు వెల్లడించారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించేందుకు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఒక ఫోన్ కాల్ తర్వాత అతని బ్యాంక్ ఖాతా నుండి BD11,000 కోల్పోయిన పౌరుడి ఫిర్యాదును విచారించగా.. ఆసియా జాతీయుల ముఠాను గుర్తించినట్లు పేర్కొన్నారు. నిఘా అధికారులు బ్యాంకులతో సమన్వయంతో ముఠా లావాదేవీలను, వారి లబ్ధిదారులను ట్రాక్ చేయగలిగారన్నారు. నిందితులు మోసానికి ఉపయోగించిన పరికరాలు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పలువురిని ట్రాప్ చేసి వారి ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును నిందితులు స్వాహా చేసినట్లు డైరెక్టర్ జనరల్ వివరించారు.
తాజా వార్తలు
- ETCA ఆద్వర్యంలో ఘనంగా 15 వ మెగా బతుకమ్మ సంబరాలు
- నేడు హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమం ప్రారంభం
- తానా ఆధ్వర్యంలో 'ప్రతిభామూర్తులు' సభ విజయవంతం
- మైటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!