అక్టోబర్ 19 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్..

- October 17, 2022 , by Maagulf
అక్టోబర్ 19 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్..

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త బిగ్ దీపావళి సేల్ ఈవెంట్ మళ్లీ అక్టోబర్ 19న ప్రారంభమవుతుంది. ఈ సేల్ అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. ఇటీవల ఫిప్ట్ కార్ట్ దీపావళి సేల్‌ ముగిసింది. అయితే వినియోగదారులకు ప్రొడక్టులను కొనుగోలు చేయడానికి మరో అవకాశం కల్పించేందుకు ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను తక్కువ రేట్లతో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఉన్నవారు ఒక రోజు ముందుగానే సేల్ ఈవెంట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. అక్టోబర్ 18 నుంచి ఫ్లిప్ కార్ట్ సేల్ ప్రారంభమవుతుంది.

ప్రొడక్టులై భారీ డీల్స్ గత సేల్ మాదిరిగానే ఉంటాయి. పండుగ వేడుకల్లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ మొదట బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించింది. ఆ తర్వాత ఇలాంటి డీల్స్‌తో మరికొన్నింటిని నిర్వహించింది. వినియోగదారులు రేపటి నుంచి స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై అలాంటి డీల్‌లను పొందవచ్చు.

ఫ్లిప్ కార్ట్ టీజర్ పేజీ Poco X4, ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై 45 శాతం వరకు డిస్కౌంట్ అందజేస్తుందని వెల్లడించింది. Samsung Galaxy S22+, iPhone 13 వంటి ప్రీమియం ఫోన్‌లు కూడా ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సమయంలో తాత్కాలిక ధర తగ్గింపులను అందించనుంది. స్మార్ట్‌టీవీలు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు సేల్ ఈవెంట్‌లో అనేక యూనిట్లపై 80 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.

ఎంపిక చేసిన నాయిస్ స్మార్ట్‌వాచ్‌లపై 20 శాతం తగ్గింపుతో పాటు ల్యాప్‌టాప్‌లపై తగ్గింపు కూడా ఉంటుంది. HP i3 ల్యాప్‌టాప్ గరిష్టంగా 512GB వేరియంట్‌తో రూ. 35,990కి అందుబాటులో ఉంటుంది. అయితే Lenovo Ryzen 5 ధర రూ.44,9990గా ఉండనుంది.

శాంసంగ్ IPS మానిటర్లు బ్యాంక్ ఆఫర్ల ఆధారంగా రూ.7,649 ప్రారంభ ధరతో అందుబాటులో ఉండనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్రకారం.. Realme నుంచి వచ్చిన టాబ్లెట్‌లతో సహా కొన్ని టాబ్లెట్‌లు ధర 8,999లకు సేల్ అందుబాటులో ఉండనున్నాయి. సౌండ్‌బార్‌లు, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు, గోప్రో, కీబోర్డ్‌లు, పవర్ బ్యాంక్, ఇతర ప్రొడక్టులపై భారీ డీల్‌లను పొందవచ్చు. దీపావళి సేల్ సందర్భంగా..ఫ్లిప్ కార్ట్ ఎస్బిఐ బ్యాంక్ కార్డ్‌లు,పేటీఏం లావాదేవీలపై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com