ఎమిరేట్స్‌లో ఉన్నప్పుడు ప్రవాస భారతీయులు పాన్, ఆధార్ కార్డులను పొందవచ్చా?

- October 18, 2022 , by Maagulf
ఎమిరేట్స్‌లో ఉన్నప్పుడు ప్రవాస భారతీయులు పాన్, ఆధార్ కార్డులను పొందవచ్చా?

యూఏఈ: ఎమిరేట్స్ లో ఉండే ప్రవాస భారతీయులు పాన్ కార్డ్, ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా? అలాగే  విదేశాలలో నివసిస్తున్నప్పుడు తమ పాత ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేయవచ్చా? ఇలా అనేక మందిలో సందేహాలు ఉంటాయి.  AskPankaj Tax Advisors దీపక్ బన్సాల్ ఇలాంటి సందేహాలకు చాలా క్లియర్ గా సమాధానాలు ఇచ్చారు.

యూఏఈ నుండి పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయవచ్చా?

విదేశీ పౌరులు, ప్రవాస భారతీయులు (NRI) భారతదేశం వెలుపల నుండి సవరణ లేదా కొత్త శాశ్వత ఖాతా సంఖ్య (PAN) కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తును ఆన్‌లైన్‌లో https://www.protean-tinpan.comలో చేయవచ్చు. దరఖాస్తుదారు పాస్‌పోర్ట్, OCI కార్డ్ లేదా PIO కార్డ్ వంటి గుర్తింపు, చిరునామా రుజువుతో పాటు చెల్లుబాటు అయ్యే ఫోన్ నంబర్, ఇమెయిల్ ఐడితో సహా వారి వ్యక్తిగత వివరాలతో ఆన్‌లైన్ ఫారమ్ (పై వెబ్‌సైట్ నుండి ఫారం 49AA) నింపాలి.  అయితే, ఒక దరఖాస్తుదారు విదేశీ పౌరసత్వ కార్డు లేదా పన్ను గుర్తింపు సంఖ్యను సమర్పించినట్లయితే, అది భారత రాయబార కార్యాలయం లేదా విదేశాలలో బ్రాంచ్ కలిగి ఉన్న భారతీయ బ్యాంకు అధీకృత అధికారి ద్వారా 'అపోస్టిల్' లేదా ధృవీకరించబడాలి. అంతర్జాతీయ తపాలా/డెలివరీకి సంబంధించిన అదనపు ఖర్చును చెల్లించడం ద్వారా పాన్ కార్డ్ డెలివరీ కోసం దరఖాస్తుదారు వారి విదేశీ చిరునామాను పేర్కొనడానికి అవకాశం ఉంది. దరఖాస్తుదారు ఆధార్ కార్డ్ లేదా భారతదేశం జారీ చేసిన డిజిటల్ సంతకాన్ని కలిగి ఉన్నట్లయితే, ఫారమ్‌ను పేపర్‌లెస్ పద్ధతిలో ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ప్రత్యామ్నాయంగా, దరఖాస్తుదారు సంతకం చేసిన ఫారమ్‌ను పోస్ట్/కొరియర్ ద్వారా భారతదేశంలోని పన్ను అధికారులకు పంపే అవకాశం ఉంది.

యూఏఈ నుండి ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేయవచ్చా?

దుబాయ్‌లోని ఎన్‌ఆర్‌ఐ ప్రవాసులు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఆధార్ కార్టులో వివరాల నమోదుకు దరఖాస్తు దారులు భారతదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. దీని తర్వాత మాత్రమే కార్డు జారీ చేయబడుతుంది.

కొత్త ఆధార్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ

ఆధార్ కార్డ్ యూఏఈలో ఉపయోగించే ఎమిరేట్స్ ఐడిని పోలి ఉంటుంది. ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ వివరాలను కలిగి ఉంటుంది. ఆ వివరాల నమోదుకు ఆధార్ సెంటర్ కు స్వయంగా వెళ్లాల్సి ఉంటుంది. ఇంతకుముందు స్థానిక నివాసితులు (భారతదేశంలో కనీసం 180 రోజులు ఉండే వ్యక్తులు) మాత్రమే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని నిబంధన ఉండేది. కాగా 2019 సెప్టెంబర్  నుండి, NRIలు భారతదేశానికి వచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించారు. ఎన్నారైలు ప్రయాణానికి ముందు కూడా ఆధార్ కేంద్రంలో అపాయింట్‌మెంట్‌ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. దరఖాస్తు దారుల పాస్‌పోర్ట్‌లో చెల్లుబాటు అయ్యే భారతీయ చిరునామా లేకుంటే, NRIలు ఇతర సూచించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు  అధికారిక UIDAI వెబ్‌సైట్‌ని సందర్శించాలి.

ఆధార్ అప్డేట్ ఎలా?

ఒక వ్యక్తి అతని/ఆమె చిరునామాను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు. అయితే పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఇమెయిల్ మొదలైన ఏవైనా ఇతర వివరాల కోసం లేదా బయోమెట్రిక్స్ వివరాల కోసం, ఆధార్ సెంటర్ కు స్వయంగా వెళ్లాల్సి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com