క్రేజీ అప్డేట్.! ‘చరణ్ - అర్జున్’ మల్టీస్టారర్.!
- October 18, 2022
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ టాలీవుడ్ స్టార్ హీరోలు. ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వున్నవాళ్లు. ఈ ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తే ఎలా వుంటుంది.?
మొన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్టీయార్, చరణ్ కాంబినేషన్ సెట్ చేశాడు జక్కన్న రాజమౌళి. ఆ సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.
ఇక, ఇప్పుడు చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే, తగ్గేదే లే.. అనేలా వుండదూ.! ఈ కాంబినేషన్ తన డ్రీమ్ అని తాజాగా ఓ ప్రోగ్రామ్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఎప్పటికైనా ఈ కాంబినేషన్లో తన బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో సినిమా తీయాలని వుందని ఆయన చెప్పారు.
అంతేకాదు, ఎప్పుడో ఈ కాంబినేషన్‌కి టైటిల్ కూడా రిజిస్టర్ చేయించేశారట ఆయన. ఆ టైటిల్‌ని వదలకుండా, రెన్యువల్ చేయిస్తూ వస్తున్నారట. అదీ సంగతి. అంటే, అల్లు అరవింద్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారన్న మాట.
గతంలో రామ్ చరణ్ కోసం అల్లు అర్జున్, ‘ఎవడు’ సినిమాలో గెస్ట్ రోల్ పోషించాడు. అయితే, ఇద్దరూ కలిసి వున్న సీన్లుండవు ఈ సినిమాలో. ఇక, అల్లు అరవింద్ తీయబోయే మల్టీ స్టారర్ అయితే, మెగా ప్రాజెక్ట్ అవ్వడం పక్కా. ఈ ఇద్దర్నీ మ్యాచ్ చేయగల దమ్మున్న కథ, తెరపై బ్యాలెన్స్ చేసి చూపించగల సత్తా వున్న డైరెక్టర్ దొరికిన మరు క్షణం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి సిద్ధంగా వున్నా.. అని కూడా అల్లు అరవింద్ తాజాగా చెప్పారు. సో, అంత దమ్మున్న డైరెక్టర్ అంటే, మళ్లీ జక్కన్నేనా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు
- భారతదేశంలోనే తొలి ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్’ సదస్సు
- భక్తుల సేవ కోసం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
- అక్టోబర్ 23 నుంచి ఖతార్ మ్యూజియమ్స్ వార్షికోత్సవ సీజన్..!!
- బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం పాస్‌పోర్ట్ కవర్ కాపీని సమర్పించాలా?