షార్జాలో మరో 2,440 పెయిడ్ పార్కింగ్ స్లాట్‌లు

- October 19, 2022 , by Maagulf
షార్జాలో మరో 2,440 పెయిడ్ పార్కింగ్ స్లాట్‌లు

యూఏఈ: నివాసితులు, సందర్శకులకు పార్కింగ్ సేవలను అందించడానికి షార్జాలో మొత్తం 2,440 కొత్త పార్కింగ్ స్థలాలను పెయిడ్ స్లాట్‌లుగా మార్చినట్లు షార్జా మునిసిపాలిటీ ప్రకటించింది, షార్జా మున్సిపాలిటీలోని పబ్లిక్ పార్కింగ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ హమద్ అల్ ఖైద్ మాట్లాడుతూ..  షార్జాలో ప్రస్తుతం 57,000 స్థలాలను పబ్లిక్ పార్కింగ్ కోసం కేటాయించామన్నారు. అవన్నీ దుర్వినియోగం కాకుండా చూసేందుకు తనిఖీ బృందాలు పర్యవేక్షిస్తున్నాయని ఆయన తెలిపారు. అవసరమైన రుసుము చెల్లించకుండా పార్కింగ్ చేయడం లేదా ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పార్కింగ్ స్థలాలను ఆక్రమించడం వంటి ఉల్లంఘనలకు ఇన్‌స్పెక్టర్లు జరిమానాలు జారీ చేస్తారని అల్ ఖద్ పేర్కొన్నారు. మునిసిపాలిటీకి ఇప్పటికే తగినంత పార్కింగ్ స్థలాలు ఉన్న అనేక ప్రాంతాల్లో 53 ఖాళీ యార్డులు ఉన్నాయని, వీటి మూసివేతకు సన్నాహకంగా మూడు రోజుల్లో ఆయా యార్డుల్లోని వాహనదారులు రావాలని మున్సిపాలిటీ హెచ్చరికల స్టిక్కర్లను పంపిణీ చేపట్టామన్నారు.  పార్కింగ్ స్థలాలను దుర్వినియోగం చేయవద్దని, ఇతర వాహనదారుల హక్కులకు భంగం కలిగించవద్దని ప్రజలకు పార్కింగ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com