ఒమన్‌లో పెరుగుతున్న ఇన్ఫ్లుయెంజా కేసులు.. అందుబాటులో టీకాలు
- October 19, 2022
మస్కట్: సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఒమన్ సుల్తానేట్ ప్రజలు సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్‌ను పొందాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయం (SQU)లో పీడియాట్రిక్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కన్సల్టెంట్ డాక్టర్ జైద్ అల్ హినై మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇన్ఫ్లుయెంజా కేసుల వ్యాప్తి పెరుగుతోందన్నారు. పిల్లలు, పెద్దలలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లను పర్యవేక్షిస్తున్నట్లు.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడని వ్యక్తులలో కేసులను గమనించినట్లు తెలిపారు. ఇన్ఫ్లుయెంజా వైరస్ కు వ్యతిరేకంగా సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయం లేదా 50 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలకు కూడా ఆరోగ్య కేంద్రాలలో ఫ్లూ టీకాలు ఉచితంగా అందజేస్తారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నార్త్ బటినా గవర్నరేట్ డిసీజ్ సర్వైలెన్స్ అండ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ ఫాత్మా హషీమ్ అబ్దుల్లా అల్ హష్మీ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రతి ఒక్కరికీ ఫ్లూ టీకాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు