షార్జాలో మరో 2,440 పెయిడ్ పార్కింగ్ స్లాట్లు
- October 19, 2022
యూఏఈ: నివాసితులు, సందర్శకులకు పార్కింగ్ సేవలను అందించడానికి షార్జాలో మొత్తం 2,440 కొత్త పార్కింగ్ స్థలాలను పెయిడ్ స్లాట్లుగా మార్చినట్లు షార్జా మునిసిపాలిటీ ప్రకటించింది, షార్జా మున్సిపాలిటీలోని పబ్లిక్ పార్కింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ హమద్ అల్ ఖైద్ మాట్లాడుతూ.. షార్జాలో ప్రస్తుతం 57,000 స్థలాలను పబ్లిక్ పార్కింగ్ కోసం కేటాయించామన్నారు. అవన్నీ దుర్వినియోగం కాకుండా చూసేందుకు తనిఖీ బృందాలు పర్యవేక్షిస్తున్నాయని ఆయన తెలిపారు. అవసరమైన రుసుము చెల్లించకుండా పార్కింగ్ చేయడం లేదా ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పార్కింగ్ స్థలాలను ఆక్రమించడం వంటి ఉల్లంఘనలకు ఇన్స్పెక్టర్లు జరిమానాలు జారీ చేస్తారని అల్ ఖద్ పేర్కొన్నారు. మునిసిపాలిటీకి ఇప్పటికే తగినంత పార్కింగ్ స్థలాలు ఉన్న అనేక ప్రాంతాల్లో 53 ఖాళీ యార్డులు ఉన్నాయని, వీటి మూసివేతకు సన్నాహకంగా మూడు రోజుల్లో ఆయా యార్డుల్లోని వాహనదారులు రావాలని మున్సిపాలిటీ హెచ్చరికల స్టిక్కర్లను పంపిణీ చేపట్టామన్నారు. పార్కింగ్ స్థలాలను దుర్వినియోగం చేయవద్దని, ఇతర వాహనదారుల హక్కులకు భంగం కలిగించవద్దని ప్రజలకు పార్కింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు
- భారతదేశంలోనే తొలి ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్’ సదస్సు
- భక్తుల సేవ కోసం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
- అక్టోబర్ 23 నుంచి ఖతార్ మ్యూజియమ్స్ వార్షికోత్సవ సీజన్..!!
- బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం పాస్పోర్ట్ కవర్ కాపీని సమర్పించాలా?
- భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు..!!