‘నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఇండస్ట్రీ’ని ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్
- October 19, 2022
జెడ్డా : సౌదీ విజన్ 2030 లక్ష్యాలను సాకారం చేయడానికి పరిశ్రమ కోసం ‘నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఇండస్ట్రీ’ని క్రౌన్ ప్రిన్స్ , ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రారంభించారు. SR1 ట్రిలియన్ విలువైన 800 కంటే ఎక్కువ పెట్టుబడి అవకాశాలను గుర్తిస్తూ.. సౌదీ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను ప్రపంచలో ప్రముఖ పారిశ్రామిక శక్తిగా మార్చేందుకు 12 ఉప-రంగాలపై దృష్టి సారించినట్లు క్రౌన్ ప్రిన్స్ అన్నారు. దేశీయ ఉత్పత్తి, చమురేతర ఎగుమతులను అభివృద్ధి చేయడంలో పెట్టుబడులను ఆకర్షించే పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను సాధించడం ఈ వ్యూహం లక్ష్యమన్నారు.12 ఉప-రంగాలలో పారిశ్రామిక దేశీయ ఉత్పత్తిని మూడు రెట్లు రెట్టింపు చేయడం, పారిశ్రామిక ఎగుమతుల విలువను SR557 బిలియన్లకు చేర్చడం, అదనపు పెట్టుబడుల మొత్తం విలువను SR1.3 ట్రిలియన్‌లకు తీసుకురావడానికి, అధునాతన సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతులను దాదాపు ఆరు రెట్లు పెంచడానికి, అధిక విలువ కలిగిన పదివేల నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించేందుకు కొత్త వ్యూహం పనిచేస్తోందన్నారు. ఈ ప్రతిష్టాత్మక జాతీయ లక్ష్యాలను సాధించడానికి పారిశ్రామిక మండలి ఏర్పాటుతో పాటు ఈ రంగ అభివృద్ధిని పర్యవేక్షించడానికి తన నేతృత్వంలోని సుప్రీం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు క్రౌన్ ప్రిన్స్ ప్రకటించారు.
తాజా వార్తలు
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!