సౌదీలో పెరిగిన 128 వస్తువుల ధరలు.. జాబితాలో చికెన్, బంగాళ దుంప
- October 19, 2022
సౌదీ: సెప్టెంబర్ నెలలో 128 వస్తువులు, సేవల ధరలలో పెరుగుదల నమోదు కాగా.. 35 ఇతర వస్తువులు ధరలు తగ్గుముఖం పట్టాయి. పెరిగిన 128 వస్తువుల జాబితాలో చికెన్, బంగాళ దుంపలు అగ్రస్థానంలో ఉన్నాయి. అదే విధంగా ధరలు తగ్గిన వస్తువుల జాబితాలో ఏలకులు మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ విషయాన్ని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) వెల్లడించింది. సౌదీ మార్కెట్‌లోని వస్తువులు, సేవల సగటు ధరలపై అథారిటీ ప్రతినెల డేటా రిపోర్టును విడుదల చేస్తుంటుంది. తాజా నివేదికలో 10 సమూహాల కింద మొత్తం 169 వస్తువుల ధరలను ప్రకటించింది. ఆహారం, పానీయాల విభాగంలో 92 వస్తువులు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో బంగాళ దుంప ధర 65.95 శాతం పెరగగా.. స్థానిక ఫ్రోజెన్ చికెన్ 36.22 శాతం పెరిగింది. ఇదే కాలంలో అమెరికన్ ఏలకులు ధర 20.10 శాతం తగ్గగా.. భారతీయ ఏలకుల ధర 15.68 శాతం తగ్గింది. ఇక 10 వస్తువులతో కూడిన దుస్తుల విభాగంలో అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. ఇతర వ్యక్తిగత వస్తువుల విభాగంలోనూ ధరలు పెరిగాయని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!
- బీచ్‌లో స్టంట్స్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీలో ఇల్లీగల్ ప్రయాణీకుల రవాణాపై కఠిన చర్యలు..!!
- పిల్లిని చంపిన వ్యక్తి వీడియో వైరల్.. నెటిజన్లు ఆగ్రహం..!!
- ఇండియన్ క్లబ్ ‘ఆవాణి’ ఓనం ఫియస్టా..!!
- కువైట్ లో ఉత్సాహంగా వికసిత్ భారత్ రన్ ..!!
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం