సూపర్ స్టార్ మహేష్ కోసం ఈసారైనా దీపిక దిగొస్తుందా.?

- October 19, 2022 , by Maagulf
సూపర్ స్టార్ మహేష్ కోసం ఈసారైనా దీపిక దిగొస్తుందా.?

గతంలో పలుమార్లు మహేష్ బాబు సినిమా కోసం హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె పేరు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ, కేవలం పుకార్ల వరకే పరిమితమైంది ఆ న్యూస్. అయితే, అప్పటి తెలుగు సినిమా పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. 
తెలుగు సినిమా, హిందీ సినిమా కాదు, ‘ఇండియన్ సినిమా’గా కీర్తికెక్కింది. దాంతో, నటీనటులు ఫలానా భాషలకు మాత్రమే పరిమితం.. అనే పరంపరను వదిలిపెట్టి, అన్ని భాషల్లోనూ సత్తా చాటుతున్నారు.
ఆ క్రమంలోనే ముఖ్యంగా నార్త్ భామలు తెలుగు సినిమాల్లో గట్టిగా చెప్పాలంటే సౌత్ సినిమాల్లో నటించేందుకు ఉబలాటపడుతున్నారు. ఆల్రెడీ దీపిక పదుకొనె, ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ కోసం ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత దీపిక ఖాతాలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పడనుందనీ వార్తలు వినిపిస్తున్నాయ్. అదే మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్. రాజమౌళి సినిమా అంటే హద్దలే లేని సినిమా. అదే, ప్యాన్ ఇండియా సినిమా. సో, ఆయన సినిమాలో చిన్న పాత్రలోనైనా నటించేందుకు నటీనటులు ఉత్సాహం చూపిస్తుంటారు.
ఆ క్రమంలోనే రాజమౌళి, మహేష్‌తో తీయబోయే ప్యాన్ ఇండియా ప్రాజెక్టులో దీపిక పదుకొనె హీరోయిన్ అనే వార్త గట్టిగా చక్కర్లు కొడుతోంది. చూడాలి మరి, ఈ గాసిప్ న్యూస్ నిజమవుతుందేమో.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com