‘ఢీ అంటే ఢీ’ అంటోన్న హీరోలు.! ఈ వారం బాక్సాఫీస్ రారాజు ఎవరవుతారో.!
- October 19, 2022
ఈ వారం ధియేటర్లలో రిలీజ్ కాబోయే, మూడు సినిమాలు ప్రముఖంగా అంచనాలు క్రియేట్ చేస్తున్నాయ్. వాటిలో ఒకటి మంచు విష్ణు నటిస్తున్న ‘జిన్నా’ మూవీ ఒకటి కాగా, మరో సినిమా శివకార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’. ముచ్చటగా మూడో సినిమా ‘ఓరి దేవుడా’.
విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి మెయిన్ ఎట్రాక్షన్ విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. దేవుడి పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నాడు. మోడ్రన్ గాడ్‌గా, ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర మాదిరి ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర వుండబోతోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయ్. అలాగే, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో విశ్వక్ సేన్ ఆల్రెడీ హిట్టు కొట్టి జోష్ మీదున్నాడు. ఆ జోష్‌తోనే ‘ఓరి దేవుడా’ అనే రీమేక్ సినిమాతో రాబోతున్నాడు.
నిజానికి ఈ వారం రిలీజ్ కాబోయే మూడు సినిమాలూ మూడు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీసే. ‘జిన్నా’కి సన్నీలియోన్ స్పెషల్ అట్రాక్షన్ అవుతుండగా, ‘ఓరి దేవుడా’కి వెంకటేష్ స్టార్ ఇమేజ్ ప్లస్ కానుంది. తమిళ హీరో శివ కార్తికేయన్‘ప్రిన్స్’ మూవీకి ‘జాతిరత్నాలు’ ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ ఫేమ్ వుండనే వుంది. సో, ఇలా చూసుకుంటే, ఈ మూడు సినిమాలూ నువ్వా.? నేనా.? అనే రేంజ్లో బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయ్. ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే, 21 వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!