‘ప్రొటెక్ట్ చైల్డ్ అండ్ వుమన్’ ఫీచర్: ఒకే క్లిక్‌తో పోలీసుల సహాయం
- October 20, 2022
దుబాయ్: అత్యవసర సమయంలో పోలీసు యాప్ ద్వారా మహిళలు, పిల్లలు మరింత సులువుగా, వేగంగా సహాయం పొందేందుకు దుబాయ్ పోలీసులు కొత్త ఆప్షన్ ను తీసుకొచ్చారు. ఇది అత్యవసర సమయంలో మహిళలు, పిల్లలకు SOS పంపడానికి వీలు కల్పిస్తుందని దుబాయ్ పోలీస్ స్మార్ట్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ హెస్సా అల్ బలూషి తెలిపారు. ‘ప్రొటెక్ట్ చైల్డ్ అండ్ వుమన్’ అని పిలువబడే ఈ ఫీచర్‌ను యాప్‌లోని ఒకే క్లిక్‌లో యాక్సెస్ చేయవచ్చన్నారు. ఆపదలో ఉన్న మహిళలు లేదా పిల్లలు యాప్‌లోని ఆప్షన్‌ను మాత్రమే ట్యాప్ చేస్తే సరిపోతుందని, వారు ఉన్న లొకేషన్ ఆటో ట్రేస్ అవుతుందని, తమ కంప్లయిట్ ను నిర్ధారించడానికి ఫిర్యాదుదారు కుడివైపు స్లయిడ్ చేస్తే సరిపోతుందని అల్ బలూషి వివరించారు. ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేయవద్దని ప్రజలను కోరారు. పోలీస్ యాప్ 4 మిలియన్ డౌన్లోడ్లను సాధించిందని, గత మూడేళ్లలో యాప్ ద్వారా 2.1 మిలియన్లకు పైగా ఫిర్యాదులు అందాయన్నారు.
తాజా వార్తలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్‌కతా ఫెస్టివల్ థీమ్..!!
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం