సమంత ‘యశోద’కు కొత్త డేట్ ఫిక్స్ చేశారోచ్.!

- October 21, 2022 , by Maagulf
సమంత ‘యశోద’కు కొత్త డేట్ ఫిక్స్ చేశారోచ్.!

సమంత నటించిన కొత్త చిత్రం ‘యశోద’ ఎప్పుడో రిలీజ్ కావల్సి వుంది. కానీ, గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాని కారణంగా సినిమాని రిలీజ్ డేట్ వాయిదా వేశారు. తాజాగా చిత్ర యూనిట్ మరో కొత్త డేట్ అనౌన్స్ చేసింది.
నవంబర్ 11న ‘యశోద’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోన్న ఈ సినిమాలో సమంత యాక్షన్ ఎపిసోడ్స్ చాలా చాలా ప్రత్యేకంగా వుండబోతున్నాయని యూనిట్ చెబుతోంది.
సమంత ఈ సినిమాలో ప్రెగ్నెంగ్‌గా కనిపిస్తున్న సంగతి గతంలో రిలీజ్ చేసిన టీజర్ ద్వారా తెలిసింది. ప్రెగ్నెంట్ అయిన సమంత చేసే యాక్షన్ ఎపిసోడ్సే ఈ సినిమాకి అత్యంత కీలకం. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ వద్ద సమంత ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంది. 
గతంలో ‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్ కోసం కూడా సమంత యాక్షన్ సీన్లు ఇరగదీసేసింది. కానీ, ‘యశోద’ మాత్రం ప్రత్యేకం అంటున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాతో నటిగా సమంత మరో మెట్టు పైకెక్కడం ఖాయమంటూ చిత్ర యూనిట్ అంచనాలు వేస్తోంది. చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com