అబుధాబి విమానాశ్రయంలో సిటీ చెక్-ఇన్ సర్వీసులు పునఃప్రారంభం
- October 22, 2022
అబుధాబి : దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత.. కీలక శీతాకాల ప్రయాణ సీజన్‌కు ముందు అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం సిటీ చెక్-ఇన్ సేవను మళ్లీ ప్రారంభించింది. జాయెద్ పోర్ట్‌లోని అబుధాబి క్రూయిస్ టెర్మినల్ టెర్మినల్ 1 వద్ద ప్రయాణీకుల కోసం చెక్-ఇన్ సేవ ప్రారంభించినట్లు.. ప్రస్తుతం ఎతిహాద్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించే ప్రయాణికులు మాత్రమే ఈ సేవను పొందగలరని ఎయిర్ పోర్ట్ వర్గాలు తెలియజేశాయి. ప్రయాణీకులు బయలుదేరడానికి 24 గంటల నుండి నాలుగు గంటల ముందు వరకు చెక్ ఇన్ చేయవచ్చన్నారు. ప్రయాణికులు తమ బ్యాగేజీని ముందుగానే చెక్ ఇన్ చేయడంతోపాటు బోర్డింగ్ పాస్‌లను స్వీకరించవచ్చని ఎయిర్ పోర్ట్ వర్గాలు వివరించారు. అల్ జహియా ప్రాంతంలోని సిటీ టెర్మినల్ ను 2019 అక్టోబర్ లో అబుధాబి విమానాశ్రయం మూసివేసిన విషయం తెలిసిందే. చెక్-ఇన్ ఛార్జీలు పెద్దలకు 45 దిర్హామ్‌లు, పిల్లలకి 25 దిర్హామ్‌లు, శిశువుకు 15 దిర్హామ్‌లు, నలుగురు సభ్యులతో కూడిన కుటుంబం Dh120 చెల్లించి ఈ సేవను పొందవచ్చు. టెర్మినల్ ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు పనిచేస్తుంది. పబ్లిక్ బస్సులు నంబర్ 9 (మెరీనా మాల్ నుండి), 44 (ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్స్ క్లబ్ నుండి) క్రూయిజ్ టెర్మినల్‌కు నడుస్తాయి. మరిన్ని వివరాల కోసం, ప్రయాణికులు 02 5833345కు కాల్ చేయవచ్చని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







