మూడు నెలల్లో 10,448 వాహనాలకు నోటీసులు
- October 22, 2022
కువైట్: గడిచిన మూడు నెలల్లో శబ్దాల నిబంధనలను ఉల్లంఘించిన 10,448 వాహనాలకు నోటీసులు జారీ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు నిర్వహించిన ట్రాఫిక్ క్యాంపెయిన్ లలో నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడిన వాహనాలపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ట్రాఫిక్ చట్టం, నిబంధనలు ఉల్లంఘించేవారిని పట్టుకోవడానికి దేశవ్యాప్తంగా భద్రత, ట్రాఫిక్ ప్రచారాలు కొనసాగుతున్నాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోడ్లపై నిబంధనల ఉల్లంఘన చూసినప్పుడు ఎమర్జెన్సీ నంబర్ (112)కు కాల్ చేయాలని లేదా (965-99324092) వాట్సాప్ నెంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ప్రతిఒక్కరు ట్రాఫిక్ చట్టం, నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరింది. పౌరులు, నివాసుల భద్రత కోసం పోలీసులకు సహకరించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విజ్ఙప్తి చేసింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







