నేరం జరిగిన నాలుగు గంటల్లోనే నిందితులు అరెస్ట్
- October 22, 2022
బహ్రెయిన్: నేరం చేసిన నాలుగు గంటల్లోనే బహ్రెయిన్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నగదు బదిలీ కంపెనీ ఉద్యోగి నుండి BD 12,260 దొంగిలించి పరారైన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ తెలిపింది. 58, 59 సంవత్సరాల వయస్సు గల నిందితుల నుండి దొంగిలించిన మొత్తాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగదు బదిలీ ఉద్యోగి.. కలెక్షన్ మొత్తాన్ని బ్యాంకులో జమ చేసేవాడు. ఇది గమనించిన నిందితులు.. కాపుకాసి అతడి దృష్టి మరల్చి డబ్బు ఉన్న బ్యాగును దొంగిలించి పారిపోయారు. అనంతరం బాధితుడు జరిగిన మోసాన్ని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నాలుగు గంటల్లోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నామని బహ్రెయిన పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







