ఎమిరేట్స్‌లో పాక్షిక సూర్యగ్రహణం.. జాగ్రత్తలు
- October 25, 2022
యూఏఈ: ఈ సంవత్సరం చివరి పాక్షిక సూర్యగ్రహణం మరికొద్ది సమయంలో ఏర్పడనుంది. యూఏఈలో మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభం కానుంది. దాదాపు రెండు గంటలపాటు ఈ ప్రక్రియ సాగనుంది. పాక్షిక సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే సరళ రేఖపైకి వస్తాయి.
-దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ ప్రకారం.. యూఏఈలో తదుపరి పాక్షిక సూర్యగ్రహణం 2027లో వస్తుంది.
-కంటి రక్షణ లేకుండా గ్రహణం సమయంలో సూర్యుడిని చూడొద్దు. దీని వల్ల కంటిచూపు దెబ్బతింటుంది. చూపు కూడా పోయే ప్రమాదం ఉంటుంది.
- గ్రహణాన్ని చూడాలంటే సోలార్ ఫిల్టర్లు లేదా మూడు సంవత్సరాల కంటే పాతది, గీతలు లేని ఎక్లిప్స్ గ్లాసెస్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
- మీకు రక్షణ చర్యలు లేని సమయంలో సూర్య గ్రహణాన్ని ఆన్లైన్లో వీక్షించడం క్షేమకరం.
-దుబాయ్‌లోని మస్జీదులలో అసర్ (సాయంత్రం) ప్రార్థనల తర్వాత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ
- మస్కట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్







