చరణ్-అర్జున్: హల్‌చల్ చేస్తున్న కొత్త రూమర్.!

- October 25, 2022 , by Maagulf
చరణ్-అర్జున్: హల్‌చల్ చేస్తున్న కొత్త రూమర్.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో ‘చరణ్ - అర్జున్’ అనే సినిమా తెరకెక్కించాలని వుందని తన మనసులో మాటను ఇటీవలే ఓ ప్రోగ్రామ్ ద్వారా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బయట పెట్టిన సంగతి తెలిసిందే.
ఈ విషయం బయటికి వచ్చినప్పటి నుంచీ అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య అంతులేని ఆసక్తి నెలకొంది. ఏదో ఒక వార్త ప్రతీరోజూ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది కూడా.
ఈ టైటిల్‌ని ఎప్పుడో రిజిస్టర్ చేయించేసి, గత కొన్నేళ్లుగా వదిలిపెట్టకుండా రెన్యువల్ చేయిస్తున్నానంటూ అల్లు అరవిందే స్వయంగా తెలిపారు. హీరోలు రెడీ, నిర్మాత రెడీ. ఇక డైరెక్టరే తరువాయి. ఆ పేరు కూడా ఇప్పుడు బయటికి వచ్చేసింది పుకారుగా. 
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ బాథ్యతను తన నెత్తిన వేసుకోబోతున్నారంటూ సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే, త్రివిక్రముడు ఈ బాధ్యతని తీసుకుంటాడా.? ఒకవేళ తీసుకున్నాడే అనుకుంటే, కథ సంగతేంటీ.? 
ఇద్దరు స్టార్ హీరోల్ని ఈక్వెల్‌గా బ్యాలెన్స్ చేయగల కథని సిద్ధం చేసే ఆ మహానుభావుడు ఎవరు.? అంతటి స్టామినా వున్న కథా రచయిత విజయేంద్రప్రసాద్ అనిపిస్తోంది.. అంటూ నెటిజన్లు కొందరు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా కీర్తించే అవకాశం ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు దక్కించుకున్నాయంటే, అందుకు కారణం విజయేంద్రప్రసాద్ అందించిన కథలే. సో, ఈ సెన్సేషనల్ ప్రాజెక్టుకీ ఆయనే కథా శ్రీకారం చుడతారేమో చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com