ఇది కదా మాస్ అంటే.! ఇది కదా మెగాస్టార్ అంటే.!

- October 25, 2022 , by Maagulf
ఇది కదా మాస్ అంటే.! ఇది కదా మెగాస్టార్ అంటే.!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రానికి తాజాగా టైటిల్ రిలీజ్ చేశారు. దీపావళికి సంబంధించి అసలు సిసలు ట్రీట్ ఇచ్చేశాడు మెగాస్టార్ ఈ అప్డేట్ తో. 
ముందు నుంచీ చెబుతున్న మాటే.ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అని టైటిల్ పెడుతున్నామని. ప్రచారం జరిగినట్లే అదే టైటిల్ పెట్టేశారు. అయితే, అధికారికంగా రిలీజ్ చేశారంతే. టైటిల్ రిలీజ్ కోసం సిద్ధం చేసిన టీజర్ వుంది చూశారూ.. మెగా ఫ్యాన్స్‌లో పూనకాలొక్కటే తక్కువ. 
తక్కువేంటీ.! పూనకాలు తెప్పించేశారంతే. అసలు సిసలు మాస్ దివాళీ ధమాకా అన్నమాట. వీరయ్యగా పక్కా ఊరమాస్ లుక్స్‌తో చేతిలో బీడీతో, మెగాస్టార్‌కి కొట్టిన పిండిలాంటి స్టైలిష్ మాస్ కటింగ్స్‌తో ప్రోమో చించేశాడంతే. ఓ యాక్షన్ బ్లాక్ నేపథ్యంలో రిలీజ్ చేసిన ప్రోమో ఇది. 
స్ర్కీన్లు దద్దిరిల్లిపోవడం ఖాయం ‘వాల్తేర్ వీరయ్య’తో అని ఈ ఒక్క ప్రోమో ప్రూవ్ చేసేసేలా వుంది. చిరంజీవి నటిస్తున్న స్ట్రెయిట్ మూవీ ఇది. బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ రాజా రవితేజ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com