రియాద్ చేరుకున్న కింగ్ సల్మాన్

- October 26, 2022 , by Maagulf
రియాద్ చేరుకున్న కింగ్ సల్మాన్

రియాద్: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ మంగళవారం సాయంత్రం జెడ్డా నుండి రియాద్ చేరుకున్నారు. కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాజును రియాద్ రీజియన్ ఎమీర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్, రియాద్ రీజియన్ డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. కింగ్ సల్మాన్ తోపాటు వచ్చిన వారిలో ప్రిన్స్ ఖలీద్ బిన్ ఫహద్ బిన్ ఖలీద్, ప్రిన్స్ మన్సూర్ బిన్ సౌద్ బిన్ అబ్దుల్ అజీజ్, ప్రిన్స్ ఖలీద్ బిన్ సాద్ బిన్ ఫహద్, ప్రిన్స్ సత్తామ్ బిన్ సౌద్ బిన్ అబ్దుల్ అజీజ్, ప్రిన్స్ ఫైసల్ బిన్ సౌద్ బిన్ మొహమ్మద్, ప్రిన్స్ డాక్టర్ హుస్సామ్ బిన్ సౌద్ బిన్ అబ్దులాజీజ్, అల్-బహా ప్రాంతానికి చెందిన ఎమిర్, ప్రిన్స్ రకాన్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ మరియు పలువురు సీనియర్ అధికారులు  ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com