ఇండియన్ ఎంబసీలో ఘనంగా 7వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

- October 26, 2022 , by Maagulf
ఇండియన్ ఎంబసీలో ఘనంగా 7వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

కువైట్: ధన్వతరి జయంతిని పురస్కరించుకొని భారత రాయబార కార్యాలయం 7వ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంది. కువైట్ లోని ఎంబసీ ప్రాంగణంలో అక్టోబర్ 23న 7వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కువైట్‌లోని భారత రాయబారి HE సిబి జార్జ్ తరపున ప్రథమ కార్యదర్శి (సంస్కృతి), డాక్టర్ వినోద్ గైక్వాడ్ పాల్గొని మాట్లాడారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కువైట్‌లోని భారతీయులందరికీ, కువైట్‌లోని భారతీయ మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయుర్వేదం ప్రకృతితో మనిషి అనుబంధాన్ని తెలియజేస్తోందన్నారు. ఈ సంవత్సరం ‘హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేదం’ ఇతివృత్తంతో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో యోగా, ఆయుర్వేదం ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఆదరణ పొందుతున్నాయని డాక్టర్ వినోద్ గైక్వాడ్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com