దుబాయ్ గ్లోబల్ విలేజ్ ఓపెన్: ఆకట్టుకుంటున్న హౌస్ ఆఫ్ ఫియర్స్, బిగ్ బెలూన్

- October 26, 2022 , by Maagulf
దుబాయ్ గ్లోబల్ విలేజ్ ఓపెన్: ఆకట్టుకుంటున్న హౌస్ ఆఫ్ ఫియర్స్, బిగ్ బెలూన్

దుబాయ్: అక్టోబరు 25న గ్లోబల్ విలేజ్ 27వ ఎడిషన్ ప్రారంభం అయింది. తొలిరోజు దేశ విదేశాల నుంచి వందలాది మంది సందర్శకులు తరలివచ్చారు.ఈ ఏడాది అనేక ప్రత్యేక ఆకర్షణలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.  

660 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న హౌస్ ఆఫ్ ఫియర్స్ సహా తొమ్మిది విభిన్నమైన పార్కులు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.ఇందులో హాంటెడ్ స్మశానవాటిక, హాస్పిటల్ సైకియాట్రిక్ వార్డు, అరుస్తున్న చెట్టు సందర్శకులకు ప్రత్యేక అనుభవాన్ని ఇవ్వనున్నాయి. గ్లోబల్ విలేజ్ ప్రవేశ ధర Dh65 గా నిర్ణయించారు.

గ్లోబల్ విలేజ్ బిగ్ బెలూన్

ఈ కొత్త ఫీచర్‌లో అతిథులు ఎంటర్‌టైన్‌మెంట్ పార్కును 360-డిగ్రీలలో చూడవచ్చు.దాదాపు 60మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన హీలియం బెలూన్‌లో ఒకేసారి 20 మంది వరకు కూర్చోని ఆస్వాదించవచ్చు.  మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఎంట్రీ ఉచితం కాగా.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి 99 దిర్హామ్ ఛార్జ్ చేయబడుతుంది. నలుగురితో కూడిన బృందానికి 350 దిర్హామ్‌లుగా నిర్ణయించారు.

రోడ్ ఆఫ్ ఆసియా

ఈ పార్క్‌లో రోడ్ ఆఫ్ ఆసియా కొత్త కాన్సెప్ట్. ఆసియాకు చెందిన శ్రీలంక, ఇండోనేషియా, కంబోడియా, మలేషియా, బ్రూనై, లావోస్, వియత్నాం, నేపాల్, భూటాన్, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన ఆహారం, ఉత్పత్తులను అందించే 40 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.

27 పెవిలియన్‌లు

గ్లోబల్ విలేజ్ 27వ ఎడిషన్‌లో 27 పెవిలియన్‌లు ఉన్నాయి. కొత్తగా ఖతార్, ఒమన్ పెవిలియన్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికా, అమెరికాస్, చైనా, ఈజిప్ట్, యూరప్, ఇండియా, ఇరాన్, జపాన్, దక్షిణ కొరియా, లెబనాన్, మొరాకో, పాకిస్థాన్, పాలస్తీనా, సిరియా, థాయిలాండ్, టర్కీ, యెమెన్, రష్యా పెవిలియన్లు ఉన్న విషయం తెలిసిందే.

200 కంటే ఎక్కువ డైనింగ్ కాన్సెప్ట్‌

50కి పైగా కొత్త డైనింగ్ కాన్సెప్ట్‌లతో పాటు 200 కంటే ఎక్కువ రెస్టారెంట్లు, కేఫ్‌లు, స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్‌లు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. ఆసియా-ప్రేరేపిత ఫ్లోటింగ్ మార్కెట్ ఇండోనేషియా రామెన్, వియత్నామీస్ ఫో స్టీమింగ్ బౌల్స్ నుండి మలేషియా స్పైసీ గ్రిల్స్, కొరియన్ డంప్లింగ్‌ల వరకు ప్రతిదీ సందర్శకులకు ప్రత్యేక అనుభవాన్ని ఇవ్వనున్నాయి. భారతీయ చాట్ బజార్ వివాహ నేపధ్యంలో భారతదేశం అంతటా ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ స్టేపుల్స్‌ను అందిస్తుంది. రైల్వే మార్కెట్ అపారమైన స్వీట్లు, పేస్ట్రీ డెకర్‌తో పూర్తిగా పునరుద్ధరించబడింది.

రాత్రి సమయాల్లో ప్రత్యేక ప్రదర్శనలు

ప్రతి రాత్రి 200 కంటే ఎక్కువ ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. ప్రసిద్ధ పాత్రలు, కచేరీలు, వినోదం, నీటి ఆధారిత స్టంట్ ప్రదర్శనలు అతిథులు ఆస్వాదించవచ్చు. పార్క్ ప్రతిరోజూ, ఆదివారం నుండి గురువారం వరకు సాయంత్రం 4 నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది. శుక్రవారాలు, శనివారాలు, ప్రభుత్వ సెలవు దినాలలో సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి 1 గంటల వరకు ఉంటుంది. ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా మంగళవారం స్త్రీలు, కుటుంబాలకు ప్రత్యేకంగా కేటాయించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com