ఈ సర్జరీల గోలేంట్రా బాబూ.! కాజల్ కూడానా.?

- October 27, 2022 , by Maagulf
ఈ సర్జరీల గోలేంట్రా బాబూ.! కాజల్ కూడానా.?

సినీ రంగంలో హీరోయిన్లు సర్జరీలు చేయించుకోవడమనేది చాలా చాలా సహజం.అలనాటి మేటి నటీమణుల నుంచీ, నేటి అందాల భామల వరకూ ఆ సాంప్రదాయం కొనసాగుతూనే వస్తోంది.
అయితే, అప్పట్లో అంతగా పట్టించుకునే వాళ్లు కాదు.పెద్దగా బయటికి పొక్కేదీ కాదు విషయం. కానీ, ఇప్పుడలా కాదు. ఏం చేసినా క్షణాల్లో బయటికి వచ్చేస్తోంది సోషల్ మీడియా పుణ్యమా అని. తాజాగా సమంత ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయ్.
అంతేకాదు, ఆకాశంలోని చందమామలో అయినా మచ్చ వుంటుంది కానీ, మచ్చ లేని చందమామ కాజల్ అగర్వాల్ కూడా తన శరీరంలోని ఓ భాగానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ తాజాగా ప్రచారం బయటికి వచ్చింది.ఈ మధ్య కాజల్ లిప్స్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయని నెటిజన్లు పసిగట్టేశారు. దాంతో ఇప్పుడీ ప్రచారం వైరల్‌గా మారింది. 
ఇటీవలే శృతిహాసన్, తన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లుగా తానే స్వయంగా తెలిపిన సంగతి తెలిసిందే.చెక్కిన శిల్పంలా వుండే శృతి హాసన్‌కీ సర్జరీ అవసరమైందా.? అని ఆశ్చర్యపోయారంతా. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com