ప్రొఫెషనల్‌ డ్రైవర్స్‌కి ఆన్‌లైన్‌లో పర్మిట్‌

- April 20, 2016 , by Maagulf
ప్రొఫెషనల్‌ డ్రైవర్స్‌కి ఆన్‌లైన్‌లో పర్మిట్‌

ఆర్‌టిఎకి చెందిన పబ్లిక్‌ ట్రాన్స్‌ ఏజెన్సీ ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ సర్వీస్‌ని ప్రారంభించింది. ప్రొఫెషనల్‌ డ్రైవర్స్‌ క్యాబ్‌ డ్రైవర్లుగా పర్మిట్‌ పొందేందుకు ఈ ఆన్‌లైన్‌ సర్వీస్‌ని వినియోగించుకోవచ్చు. స్కూల్‌ బస్సు డ్రైవర్ల పర్మిట్‌ కోసం కూడా వినియోగించుకునేలా ఆన్‌లైన్‌ సౌకర్యం కలిపించారు. ఆర్‌టీఏ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ సీఈఓ అబ్దుల్లా యూసుఫ్‌ అల్‌ అలీ మాట్లాడుతూ, ఆర్‌టీఏ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా త్వరితగతిన పర్మిట్స్‌ పొందవచ్చునని వివరించారు. కొత్త విధానం ద్వారా 15 నిమిషాల నుంచి 5 నిమిషాల్లోపే పర్మిట్‌ పొందవచ్చు. అలాగే 12 కాకుండా 2 డాక్యుమెంట్లతోనే పర్మిట్‌ పొందడానికి వీలుంటుంది. వీటిల్లో క్రిమినల్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌, డ్రైవర్స్‌ ఐడీ ఉంటే సరిపోతుంది. 2015లో 26752 పర్మిట్స్‌ మంజూరు చేసింది. ఇందులో 8304 కొత్త పర్మిట్లు కాగా, 18128 రిన్యూవ్డ్‌ పర్మిట్లు, 323 రీప్లేస్‌మెంట్‌ పర్మిట్లు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com