కొత్త నివాసిత చట్టం అక్టోబర్ నుంచి
- April 20, 2016
ఖతార్లో వలసదారులకు సంబంధించి కొత్త నివాసిత చట్టం అమల్లోకి రానుంది. అక్టోబర్ నుంచి ఈ చట్టం అమల్లోకి రానున్న్నట్లు తెలియవస్తుంది. ఈ కొత్త చట్టం ప్రకారం ఫారిన్ వర్కర్లపై రెండేళ్ళ బ్యాన్ని తొలగించారు. అంటే ఎప్పుడైనా ఫారిన్ వర్కర్ తిరిగి ఖతార్లో అడుగుపెట్టి, కొత్త ఉద్యోగం చేసుకోవచ్చు. అయితే, దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. కోర్టు తీర్పుల కారణంగా దేశం నుంచి పంపివేయబడ్డవారికి ఈ కొత్త చట్టం వర్తించదు. వివాదాలు ఎదుర్కొన్న వర్కర్ కోర్టులో ఫిర్యాదు చేసినప్పుడు, కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే అలాంటి వ్యక్తికీ ఈ కొత్త చట్టం వర్తించదు. కొత్త చట్టం ప్రకారం, వలస కార్మికులు తమ ఉద్యోగాల్ని ప్రభుత్వ అనుమతితో మార్చుకోవచ్చు. యజమానితో ఉన్న వివాదాల్ని పరిష్కరించుకోగలిగినవారికి ఈ కొత్త చట్టం ఎంతో ఉపయోగరంగా ఉంటుంది. అలాగే, యజమానితో సంబంధం లేకుండా, ఎగ్జిట్ పర్మిట్స్ కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ని కార్మికులు సంప్రదించవచ్చు. ఏమైనా వివాదాలుంటే, మినిస్ట్రీ వర్కర్కీ అలాగే యజమానికీ సమాచారం పంపిస్తుంది. అత్యవసర సందర్భాలలో యజమానికీ, కార్మికుడికీ మధ్య ఒప్పందం కుదిరితే వెంటనే ఎగ్జిట్ పర్మిట్ వచ్చేలా కొత్త చట్టంలో నిబంధనలున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







