హెబ్బా పటేల్ ‘బ్లాక్ అండ్ వైట్’ టీజర్ టాక్: నో కాంప్రమైజ్ అంటోన్న ‘కుమారి’.!
- October 28, 2022
‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది హెబ్బా పటేల్. తొలి సినిమాకే బోల్డ్ బ్యూటీ అనిపించుకుంది. ఆ తర్వాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి కొన్ని సినిమాలతో సూపర్ హిట్లు కూడా తన ఖాతాలో వేసుకుంది.
అయితే, గత కొంతకాలంగా కెరీర్‌లో పెద్దగా కలిసి రాని హెబ్బా పటేల్, ఇటీవల ‘ఓదెల రైల్వేస్టేషన్’ అనే ఓటీటీ కంటెంట్ ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. పర్‌ఫామెన్స ఓరియెంటెడ్ రోల్‌తో అదరగొట్టేసింది. అంతకు ముందు వరకూ హెబ్బా పటేల్ మీద వున్న అభిప్రాయాలు ఈ సినిమాతో మారిపోయాయ్.
కంప్లీట్ ట్రాన్స్‌ఫామేషన్ చూపించింది ఈ సినిమా ద్వారా హెబ్బా పటేల్. తాజాగా హెబ్బా నటించిన మరో సినిమా చర్చల్లోకి వచ్చింది. సినిమా పేరు ‘బ్లాక్ అండ్ వైట్’. ఈ సినిమా కూడా ఇంచుమించు హీరోయిన్ సెంట్రిక్ మూవీనే అని చెప్పొచ్చు.
మళ్లీ బోల్డ్ క్యారెక్టర్‌లోనే కనిపించింది ఈ సినిమా కోసం హెబ్బా పటేల్. స్మోక్ చేయడం దగ్గర్నుంచీ కొన్ని బోల్డ్ సన్నివేశాల్లోనూ ఈజీగా నటించేసింది హెబ్బా పటేల్. అప్‌కోర్స్.! అది ఆమెకు కొట్టిన పిండే అనుకోండి. లేటెస్టుగా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. చూడాలి మరి, ఈ సినిమాతో కూడా హెబ్బా హిట్ కొట్టిందబ్బా.! అనిపిస్తుందేమో.!
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







